Andhra News: కాకినాడలో ఆశా వర్కర్ల ఆందోళన రణరంగం

కొవిడ్‌ సమయంలో మృతిచెందిన ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద

Updated : 07 Feb 2022 14:53 IST

కాకినాడ: కొవిడ్‌ సమయంలో మృతిచెందిన ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆశాలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన రణరంగంగా మారింది. ఆశా కార్యకర్తలను ముందుకు వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో బారికేడ్లను తోసుకొని మరీ ఆశాలు ముందుకు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు, ఆశా కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

తోపులాటలో ఓ ఆశా కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చేస్తున్న తమను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, లాఠీలతో కొట్టారని ఆశాలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి పీఎస్‌లకు తరలించారు. పోలీసుల తీరును ఆశాలు తీవ్రంగా తప్పుబట్టారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టుల చేస్తారా? అని నిలదీశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని