హైదరాబాద్‌లో ఆషాఢమాస బోనాలు ప్రారంభం

హైదరాబాద్‌లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Updated : 11 Jul 2021 15:37 IST

గొల్కోండ: హైదరాబాద్‌లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో  తొలి బోనం సమర్పించారు. ఇవాళ ప్రారంభమైన ఆషాఢబోనాలు వచ్చే నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని