TS News: కేటీఆర్‌ కేంద్ర ఐటీ మంత్రి కావాలన్న నెటిజన్‌.. కేటీఆర్‌ ఏమన్నారంటే?

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో నిర్వహించిన ‘ఆస్క్‌ యువర్‌ కేటీఆర్‌’ కార్యక్రమంలో నెటిజిన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు...

Published : 14 Jan 2022 01:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో నిర్వహించిన ‘ఆస్క్‌ యువర్‌ కేటీఆర్‌’ కార్యక్రమంలో నెటిజిన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. కేటీఆర్‌ కేంద్ర ఐటీ మంత్రి కావాలని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా... సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉన్నట్టు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. ప్రజలు శాంతి, సుస్థిరత కోరుకుంటున్నారని, తమ ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఫైబర్‌ నెట్‌ ద్వారా తొలి దశలో 2022 ఏప్రిల్‌ కల్లా తెలంగాణలోని గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యూపీలో ప్రస్తుతం సమాజ్‌ వాది పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఓ నెటిజన్‌ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని