- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
AskKTR: తర్వాత సీఎం అభ్యర్థి మీరేనా..? నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఏంటంటే?
హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు, వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. కాలిగాయంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన.. తాజాగా ట్విటర్ వేదికగా నెటిజన్లతో ‘#AskKTR’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలు.. కేటీఆర్ సమాధానాలు
ప్రశ్న: మీ ఆరోగ్యం ఎలా ఉంది?
కేటీఆర్: నేను ఆరోగ్యంగానే ఉన్నా బ్రదర్.
ప్రశ్న: తర్వాతి ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు?తెరాస నుంచి సీఎం అభ్యర్థి మీరేనా?
కేటీఆర్: కేసీఆర్ గారి రూపంలో సమర్థుడైన సీఎం మనకు ఉన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్ కొడతారు.
ప్రశ్న: భాజపా నాయకులు ప్రచారంలో దూసుకుపోతుంటే తెరాస పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
కేటీఆర్: ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ.
ప్రశ్న: నేటి యువత రాజకీయాల్లోకి రావచ్చా?ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయాలపై మీ మోటో ఏంటి? ఎలాంటి నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరేం చెబుతారు?
కేటీఆర్: ప్రస్తుత పరిస్థితుల్లో యువత కచ్చితంగా రాజకీయాల్లో రావాలి. ఎలాంటి నేపథ్యం లేకుండా మన సీఎం సర్‌తో సహా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు.
ప్రశ్న: సెక్రటేరియట్ ఎప్పుడు రెడీ అవుతుంది సర్?
కేటీఆర్: దసరాకు సిద్ధమవుతుందని నేను ఆశిస్తున్నా.
కేటీఆర్ సర్ మిమ్మల్ని బిగ్స్క్రీన్పై చూడాలనుకుంటున్నాం. ఏదైనా అవకాశం ఉందా?
కేటీఆర్: ఇప్పటివరకూ నా రాజకీయ ప్రసంగాలను చూడకపోతే ‘బిగ్‌స్క్రీన్’పై చూడొచ్చు.
ఆరు నెలల్లో సీఎం కేసీఆర్ మూడుసార్లు ప్రొటోకాల్ ఉల్లంఘించారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తే సాదరంగా ఆహ్వానించరా? తెలంగాణ సీఎం.. ప్రధానికన్నా గొప్పవారా? హిందీలో సమాధానం ఇవ్వగలరు!
కేటీఆర్: ప్రొటోకాల్‌ను స్పష్టంగా పాటించాం. ప్రైవేటు విజిట్లకు వచ్చిన ప్రధానిని సీఎం సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మరొక విషయం దీనిని హిందీలో రాయాల్సిన అవసరం లేదు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఓ అభిమాని మీరే మా హీరో అంటూ మంత్రి కేటీఆర్ చిన్న నాటి చిత్రాన్ని ట్విటర్లో పంచుకున్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. అది నా ఫేవరెట్ చిత్రాల్లో ఒకటని కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ జెండాను వాట్సప్ డీపీగా మార్చాలని పీఎం చెప్పడం వల్ల దేశ జీడీపీ పెరుగుతుందా?
కేటీఆర్: సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ పిక్ మారిస్తే ఏం జరుగుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకు వెళ్తుంది.
విద్యుత్ రంగంలో సంస్కరణలపై మీ విధానం ఏంటి?
కేటీఆర్: భారత్ లాంటి దేశంలో సమతుల్యత అనేది అవసరం. పూర్తిగా ప్రైవేటీకరిస్తే రాయితీలు పొందే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి.
ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడంలో ఎంతో గొప్పగా చేస్తున్నారు. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణ ఎందుకు చేయలేకపోతున్నారు?
కేటీఆర్: ఈ విషయంలో మనం కూడా మనవంతు కృషి చేయాలి. అందుకే ‘10 మినిట్స్ - 10 ఏఎం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.
మన రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇతర క్రీడలనూ ఎందుకు ప్రొత్సహించకూడదు?
కేటీఆర్: తప్పకుండా చేద్దాం.
తర్వాత వచ్చే ఎన్నికలకి మన ప్రత్యర్థిగా ఏ జాతీయ పార్టీతో పోరాడాలి?రెండు జాతీయ పార్టీలతో ఒకేసారి యుద్ధం సాధ్యమేనా?మన ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని చూడాలి?
కేటీఆర్: జాతీయ పార్టీలే ఎందుకు? పోరులో ఇంకా చాలా మంది ఉన్నారు.
తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు.. జిల్లాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాలి సర్..
కేటీఆర్: అన్ని జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించాం బ్రదర్..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
DK: ఆ సమయంలో రోహిత్‌పై విమర్శకుల బంతులు దూసుకొచ్చాయి: డీకే
-
Crime News
రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
-
Movies News
Anasuya: దయచేసి.. నా ట్వీట్లను రాజకీయం చేయొద్దు: అనసూయ
-
General News
Andhra News: బకాయిలు చెల్లించేశాం.. ఆ నిషేధం ఏపీకి వర్తించదు: విజయానంద్
-
Sports News
IND vs PAK : దాయాదుల పోరులో భారత్‌కే ఎడ్జ్.. ఎందుకో చెప్పిన పాక్ మాజీ ఆటగాడు
-
General News
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Telangana News: తెదేపాకు రాజీనామా చేస్తా.. కొత్తకోట దయాకర్‌రెడ్డి కంటతడి