భూమికి చేరువగా గ్రహశకలం 

బోయింగ్ విమానం కంటే పరిమాణంలో పెద్దదైన గ్రహశకలం భూమికి చేరువగా వస్తున్నట్లు నాసా వెల్లడించింది. ఆస్టరాయిడ్‌ 2020ఆర్‌కే2 పేరుతో పిలవబడే ఈ గ్రహశకలం

Updated : 09 Dec 2021 16:38 IST

వాషింగ్టన్‌: బోయింగ్ విమానం కంటే పరిమాణంలో పెద్దదైన గ్రహశకలం భూమికి చేరువగా వస్తున్నట్లు నాసా వెల్లడించింది. ఆస్టరాయిడ్‌ 2020ఆర్‌కే2 పేరుతో పిలవబడే ఈ గ్రహశకలం బుధవారం రాత్రి భూకక్ష్యను దాటనున్నట్లు నానా ప్రకటించింది. సెకనుకు 6.68 కిలోమీటర్ల వేగంతో గ్రహశకలం భూమి వైపు కదులుతోందని తెలిపింది. భూమి ఉపరితలానికి 38 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలం వల్ల భూమికి నష్టం కలిగే ఆస్కారం చాలా చాలా తక్కువగా ఉన్నట్లు ఈ అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది.

ఇది భూమికి దగ్గరగా వస్తున్నప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని భూమి నుంచి చూసేందుకు అవకాశం లేదని నాసా తెలిపింది. ఈ శకలం 15 నుంచి 30 అడుగుల వెడల్పు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహశకలం బుధవారం భూకక్ష్యను దాటి వెళ్లిన తర్వాత తిరిగి 2027 వరకూ ఇది భూమికి దగ్గరగా వచ్చే అవకాశం లేదని నాసా వివరించింది. గత నెల కూడా బస్సు పరిమాణంలో ఉన్న ఓ గ్రహశకలం భూకక్ష్యను దాటి వెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని