Andhra news: స్థలం కబ్జా చేసిన వైకాపా కార్పొరేటర్.. బాధితుల ఆత్మహత్యాయత్నం

వైకాపా కార్పొరేటర్‌ తమ భూమిని కబ్జా చేశారని, మీరే న్యాయం చేయాలంటూ ఓ జంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది.

Updated : 25 Jun 2024 15:20 IST

అమరావతి: వైకాపా కార్పొరేటర్‌ తమ భూమిని కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ ఓ జంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. బాధితుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన దంపతులకు నగరంలో 1200 గజాల స్థలం ఉంది. దానిని వైకాపాకు చెందిన మహిళా కార్పొరేటర్ కబ్జా చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఓ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని