‘అయోధ్య’ స్పెషల్ @ 4 PM

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ...జై శ్రీరామ్‌ నినాదాలతో మోదీ తన ప్రసంగం ప్రారంభించారు.

Updated : 29 Nov 2023 12:39 IST

1. దేశమంతా రామమయం: ప్రధాని మోదీ

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ...జై శ్రీరామ్‌ నినాదాలతో మోదీ తన ప్రసంగం ప్రారంభించారు. ‘‘ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు కానీ, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు వినిపిస్తాయి. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం నా మహద్భాగ్యం’’అని మోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మోదీ ప్రతిజ్ఞ నెరవేరిన రోజు

సుమారు 29 సంవత్సరాల తరవాత ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటించారు. రామ మందిరం నిర్మించినప్పుడే తిరిగి ఈ ప్రాంతానికి వస్తానని 1992లో ప్రతిజ్ఞ చేశారట. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రత్తి కల్పించిన అధికరణ 370 రద్దు కోసం భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీ నాయకత్వంలో జరిగిన తిరంగా యాత్రకు కన్వీనర్‌గా ఉన్న మోదీ చివరిసారిగా అయోధ్యలో పర్యటించారు. విశేషమేమింటంటే ఆ అధికరణ రద్దై నేటికి సరిగ్గా ఏడాది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. PICS: అయోధ్య రామధామ భూమిపూజ

 

4. అయోధ్యలో మోదీ సాష్టాంగ నమస్కారం!

రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రామ ధామానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భూమిపూజ అనంతరం జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ వేదికపైకి విచ్చేసి అతిథులందరికీ సాష్టాంగ నమస్కారం చేసి పలకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 175మంది అతిథులను రామ్‌తీర్థ ట్రస్టు ఆహ్వానించగా.. వారిలో 135 మంది మత పెద్దలు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. 500 ఏళ్ల సంఘర్షణ ఫలితం రామమందిరం: యోగి

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ... రాముడి ఆలయం 500 ఏళ్లపాటు జరిగిన సంఘర్షణ ఫలితమన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగానే మందిరం నిర్మించుకోగలుగుతున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అయోధ్యలో భూమిపూజ... దిల్లీలో సంబరాలు

7. ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం..!

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు, ప్రముఖులు వారి ఇంటివద్దే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు వారి అధికారిక నివాసంలో రామునికి పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి ఉషా నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం చేశారు. ఉపరాష్ట్రపతి భవన్‌ సిబ్బంది కూడా రామాయణ పఠనంలో పాల్గొన్నట్లు వెంకయ్య నాయుడు ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘భారతీయుల కల నెరవేరిన రోజు..’

అయోధ్య నగరంలో రామ మందిరాన్ని నిర్మించేందుకు నేడు అంకురార్పణ జరిగింది. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో కొద్దిమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అయోధ్యలో వైభవంగా భూమిపూజ 

అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా  రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌, ఇతర ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అయోధ్యపై ‘రామాయణం’ తారలు ఏమన్నారంటే..

శ్రీ రామచంద్రుడి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనేది హిందువుల చిరకాల కోరిక. ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకొని బుధవారం కోవెల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దీంతో అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం అన్నట్లుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా రాముడి స్మరణతో భక్తసంద్రంలో మునిగితేలుతున్నారు. సాధారణ ప్రజలే భక్తి భావనతో ఉప్పొంగిపోతుంటే.. మరి రామాయణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన ‘రామాయణం’ సీరియల్‌ తారాగణం ఎలా ఫీల్‌ అవుతోంది?అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం సందర్భంగా ఆ సీరియల్‌లో నటించిన పలువురు తారలు ట్విటర్‌ వేదికగా ఏమన్నారంటే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని