Health: చిగుళ్ల ఆరోగ్యంతోనే దంతాల మెరుపు

నోరు బాగుంటే ఆరోగ్యం బాగున్నట్టే..ఆహారపు అలవాట్లు మారిన తర్వాత దంతక్షయం, చిగుళ్ల సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. సరయిన విధంగా నోరు శుభ్రం చేసుకోకపోవడంతో ఎన్నో రకాల ఇబ్బందులు వెంటాడుతున్నాయి. 

Published : 04 Jul 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నోరు బాగుంటే ఆరోగ్యం బాగున్నట్టే..ఆహారపు అలవాట్లు మారిన తర్వాత దంతక్షయం, చిగుళ్ల సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. సరైన విధంగా నోరు శుభ్రం చేసుకోకపోవడంతో ఎన్నో రకాల ఇబ్బందులు వెంటాడుతున్నాయి. వీటన్నింటికి ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం చూపించారని ఆయుర్వేద ఫిజిషియన్‌ గాయత్రిదేవి తెలిపారు.

వీటిని అధిగమించండి

* చిగుళ్ల ఆరోగ్యానికి తీయ్యటి పదార్థాలు, స్వీట్లు, మైదా పదార్థాలు, క్రీం బిస్కెట్లు లాంటి చిరుతిళ్లను తగ్గించుకోవాలి. వీటితో చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

* పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చెరకు, మామిడి, యాపిల్‌ లాంటి వాటిని తినాలి. దీంతో దంతాలు శుభ్రమై చిగుళ్లు గట్టి పడుతాయి. 

* ఆహారం తీసుకున్న ప్రతిసారి నీటితో పుక్కిలించాలి. రాత్రి పడుకునే సమయంలో ఉప్పునీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. 

* రోజు ఒక చెంచా నువ్వులను నమిలితే చిగుళ్లు బాగుంటాయి. నువ్వుల నూనెతో చిగుళ్లను మసాజ్‌ చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటాయి.

* పొగ, గుట్కా,మద్యం,పాన్‌మసాలా లాంటివి చిగుళ్లను దెబ్బతీస్తున్నాయి.

* కరక్కాయ కషాయం పుక్కిలిస్తే దంతక్షయం తొలగిపోతుంది. పళ్లనుంచి రక్తం కారడాన్ని తగ్గిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని