
Health: అజీర్తి బాధలకు ఇలా చేస్తే విరుగుడు
ఇంటర్నెట్ డెస్క్: పొట్టలో ఏ చిన్న సమస్య వచ్చినా సంకటం మొదలవుతుంది. అజీర్తి బాధ చెప్పలేనంత ఇబ్బంది పెడుతుంది. తిన్నది అరగదు.. పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది. పొట్టంతా రాయిలా మారుతుంది. ఎటు కదలలేం.. ఏ పనీ చేయలేకపోతాం. పొట్టలో అజీర్తి బాధలకు ఆయుర్వేదంలో ఆయుర్వేద ఫిజిషియన్ గాయత్రీదేవి పలు నివారణ మార్గాలను సూచించారు.
* జీర్ణమండలం శరీరమనే యంత్రానికి ఇంధనాన్ని సరఫరా చేసే అతి ముఖ్యమైన వ్యవస్థ. ఇందులో ఏ చిన్న సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపిస్తుంది.
* ఆహారం అధికంగా తీసుకోవడంతోనే అజీర్తి వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
* ఛాతీ, గుండెలో మంటగా అనిపిస్తుంది. అజీర్తితో పాటు బరువు తగ్గిపోతున్నపుడు, తరచు వాంతులు అవుతున్నపుడు మలం రంగులో మార్పులు కనిపిస్తున్నపుడు శరీరంలో ఏదో జబ్బు ఉన్నట్టు అనుమానించాలి.
* ఆకలి, జీర్ణశక్తి సరిగా ఉంటే ఎలాంటి అనారోగ్యం ఉండదు. ఎవరికైనా ఆకలి, జీర్ణశక్తి సరిగా లేకపోతే మొదట పుల్లపుల్లగా, కారంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి ఆకలి, జీర్ణశక్తిని పెంచుతాయి. తీపి పదార్థాలు తింటే ఆకలి తగ్గిపోతుంది.
* పచ్చి అరటికాయను ఎండబెట్టి పొడి చేసి ఒక గ్రాము ఉప్పుతో కలిపి సేవించాలి.
* బెల్లంతో శొంఠిపొడి కలిపి భోజనానికి ముందు తీసుకుంటే అజీర్తి బాధలు తగ్గుతాయి.
* పొట్ట ఉబ్బరంగా ఉన్నపుడు ఉప్పు కలిపిన నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది.
* అల్లం, జీలకర్ర, సైంధవ లవణం నిమ్మరసంలో ఊరవేసి ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటే పొట్టలో అజీర్తి బాధ ఉండదు.
* మర్రి చెక్కను పొడిగా చేసిగానీ కషాయం పెట్టి గానీ తీసుకుంటే బాగుంటుంది.
* కరివేపాకు, పుదీనా, కొత్తిమీర జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి.
* వ్యాయామం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే పడుకుంటే భోజనం జీర్ణం కాదు.
* నిమ్మరసం, అల్లం, ఉప్పు కలిపి భోజనం చేసే ముందు తీసుకుంటే ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
* వాముని వేడి చేసి పొడిగా మార్చుకొని అన్నం తినడానికి ముందు ఒక ముద్ద నెయ్యితో అన్నంలో కలుపుకొని తినాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు
-
Politics News
Amit Shah: తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తాం: అమిత్‌షా
-
Sports News
IND vs ENG : మూడో రోజూ వర్షం అడ్డంకిగా మారే అవకాశం.. అయినా ఇంగ్లాండ్‌కే నష్టం!
-
Crime News
Suicide: చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
BJP: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా చేయాలి తప్ప ఇలానా?: భాజపా నేత ఇంద్రసేనారెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)