Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?

ఒత్తుగా ఉన్న జుట్టు కొంచెం..కొంచెం రాలిపోతుంటే ఎంతో బాధ పడుతాం. చాలా ఆందోళన చెందుతాం. ఏదో తెలియని దిగులు మొదలవుతుంది. జుట్టు రాలిపోతుందని మందులు, షాంపూలు, సబ్బులు మార్చుతుంటారు. నిజానికి జుట్టు రాలిపోవడం వెనక పోషకాహార లోపాలు, వాతావరణ కాలుష్యం కూడా తోడవుతుంది.

Published : 08 Aug 2022 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒత్తుగా ఉన్న జుట్టు కొంచెం..కొంచెం రాలిపోతుంటే ఎంతో బాధ పడుతాం. చాలా ఆందోళన చెందుతాం. ఏదో తెలియని దిగులు మొదలవుతుంది. జుట్టు రాలిపోతుందని మందులు, షాంపూలు, సబ్బులు మార్చుతుంటారు. నిజానికి జుట్టు రాలిపోవడం వెనక పోషకాహార లోపాలు, వాతావరణ కాలుష్యం కూడా తోడవుతుంది. వైద్యుల వద్దకు వెళ్లి సరయిన కారణం తెలుసుకొని చికిత్స చేసుకుంటే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని ఆయుర్వేద ఫిజిషియన్‌ డాక్టర్‌ పెద్ది రమాదేవి తెలిపారు.

ఇవే కారణం కావొచ్చు...

* తీసుకునే ఆహార పదార్థాలు మొదలుకొని తీవ్రమైన వేడి, మానసిక ఒత్తిడి, ఆందోళనలు కారణమవుతాయి. 

* తలస్నానం చేసినా, తల దువ్వినా రోజుకు 50 వెంట్రుకలు రాలిపోతాయి.
ఇది సహజం. కానీ అంతకంటే ఎక్కువగా జుట్టు రాలిపోతే మాత్రం జాగ్రత్త పడాల్సిందే.

* వయస్సు, హార్మోన్ల తీరుతో జుట్టు రాలిపోవడానికి అవకాశం ఉంది. బీ12, విటమిన్‌ డి, పోలిక్‌ యాసిడ్‌ లోపంతో ఎక్కువగా రాలుతున్నట్టు తెలుస్తోంది.

ఈ జాగ్రత్తలు తీసుకొని చూడండి

*  జిమ్‌ చేసినపుడు వచ్చే చెమట శుభ్రం చేయడానికి తలస్నానం చేస్తారు. ఈ సమయంలో జుట్టు రాలిపోవచ్చు. ఏ నీళ్లు పడితే వాటితో చేయొద్దు. మంచి నీటితో తల స్నానం చేయాలి.

* మందారం ఆకులు, కుంకుడు కాయ, మెంతులు వేసుకొని తలస్నానం చేయాలి.

* శికాకాయతో స్నానం చేసినా మేలు కలుగుతుంది.

* కోడిగుడ్డు, పెరుగు, అరటి పండు, ఆలీవ్‌ నూనె, నిమ్మరసం మిశ్రమాన్ని తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

* మందార పూలు దంచి తలకు పట్టించినా బాగుంటుంది. జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని