AP News: ఆనందయ్యకు ఆయుష్‌ శాఖ నోటీసులు

ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌కు ఆనందయ్య...

Updated : 12 Jan 2022 20:14 IST

నెల్లూరు: ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌కు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయుష్‌ శాఖ స్పందించి. ‘‘ఆనందయ్య మందుతో 48గంటల్లో ఒమిక్రాన్‌ తగ్గిస్తామంటూ సోషల్‌ మీడియాతో ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు ఇస్తున్నట్టు తెలిసింది. మందుల తయారీకి ఆనందయ్య అనుమతి తీసుకోలేదు. ఆయుర్వేద మందులుగా ఆనందయ్య పేర్కొనడం చట్టవిరుద్ధం. ఒమిక్రాన్‌ పేరిట మందు ఇవ్వకూడదని తెలిపాం. ఆనందయ్య వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉంటే ఇవ్వాలని తెలిపాం. ఇమ్యూనిటీ కోసం ఆయుష్‌ శాఖలో ఔషధాలున్నాయి’’ అని ఆయుష్‌ శాఖ కమిషనర్‌ రాములు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని