స్వాతంత్ర్య సంబురాలు ప్రారంభించిన కేసీఆర్‌

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట స్వాతంత్ర్య సంబరాలు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రారంభమయ్యాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మఖ్యఅతిథిగా..

Updated : 10 Aug 2022 16:59 IST

హైదరాబాద్‌: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట స్వాతంత్ర్య సంబరాలు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రారంభమయ్యాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘భారత స్వాతంత్ర్య చరిత్ర ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం’’ అని వివరించారు. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో కళారూపాల ప్రదర్శన ఆకట్టుకుంది. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

హన్మకొండలో గవర్నర్‌ 

హన్మకొండలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్వాంతంత్ర్య సంబురాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  జాతీయ పతాకావిష్కరణ, పోలీస్ మార్చ్, గాలిలో బెలూన్లు వదలడం, దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవ్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరపనున్న ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. ఇవాళ్టి నుంచి 2022 ఆగస్టు 15వ వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న మహోత్సవాలకు నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని నియమించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని