Children: పిల్లలకు బి 12 లోపమా..? ఏం చేయాలంటే..!

పిల్లలకు బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగా లేకుండా ఉండటం, తల ఎదుగుదల తగినట్టు లేకపోతే విటమిన్‌ బి 12 లోపం ఉన్నట్టే..కొంతమంది పిల్లలకు మూర్ఛ కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను 13 ఏళ్లలోపు గుర్తించి సరయిన విటమిన్లను అందించినట్లయితే వాళ్లకు మెరుగైన వైద్యం అందించినట్లవుతుంది.

Published : 07 Sep 2022 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలకు బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగా లేకుండా ఉండటం, తల ఎదుగుదల తగినట్టు లేకపోతే విటమిన్‌ బి 12 లోపం ఉన్నట్టే..కొంతమంది పిల్లలకు మూర్ఛ కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను 13 ఏళ్లలోపు గుర్తించి సరయిన విటమిన్లను అందించినట్లయితే వాళ్లకు మెరుగైన వైద్యం అందించినట్లవుతుంది.

ఈ విషయాలు తెలుసుకోండి

* పిల్లలకు అలసటగా ఉన్నా, రక్తహీనత కనిపించినా అప్రమత్తం కావాలి

* మతి మరుపు, జ్ఞాపకశక్తి లోపం కనిపిస్తుంది.

* పాలు, పెరుగు, వెన్న,చేపలు, గుడ్డు, మాంసంలలో ఎక్కువగా ఉంటుంది.

* మాంసాహారుల కంటే శాకాహారుల్లో బి 12 లోపం అధికంగా కనిపిస్తుంది.

* శాకాహారులు తమ పిల్లలకు పాల ఉత్పత్తులను అధికంగా అలవాటు చేస్తే లోపం అధిగమించవచ్చు.

* పిల్లల ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా తల్లిదండ్రులు రక్త పరీక్షలు చేయించాలి. అవసరమైతే విటమిన్‌ సిరప్‌లను అందివ్వాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని