మూడు తలలతో శిశువు జననం!

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఓ నవజాత శిశువు 3 తలలతో జన్మించింది. గులారియపుర్‌కు చెందిన రాగిని సోమవారం ఈ చిన్నారికి జన్మ నిచ్చింది....

Published : 14 Jul 2021 01:19 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఓ నవజాత శిశువు 3 తలలతో జన్మించింది. గులారియపుర్‌కు చెందిన రాగిణి సోమవారం ఈ చిన్నారికి జన్మ నిచ్చింది. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంతవరకు ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని రాగిణి కుటుంబ సభ్యులు తెలిపారు. 

మూడు తలలతో శిశువు జన్మించడంతో వైద్యులతో పాటు కుటుంబ సభ్యులు విస్మయం చెందారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉండటంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మూడు తలలతో బిడ్డ జన్మించిందని తెలుసుకున్న వారంతా ఆ శిశువును చూసేందుకు తరలివస్తున్నారు. కొంత మందైతే అది దేవుడి అవతారమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని