బద్రీనాథ్‌ ఆలయ పునఃదర్శనం ఎప్పుడంటే..!

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు మే 18వ తేదీన తెరచుకోనున్నాయి. భక్తుల సందర్శనార్థం మే 18న తెల్లవారుజామున 4.15 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు చార్దాం దేవస్థానం బోర్డు తెలిపింది....

Updated : 17 Feb 2021 10:54 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు మే నెలలో తెరచుకోనున్నాయి. భక్తుల సందర్శనార్థం మే 18న తెల్లవారుజామున 4.15 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు చార్దాం దేవస్థానం బోర్డు తెలిపింది. మంగళవారం వసంత పంచమి సందర్భంగా తెహ్రీ రాజవంశస్తుల నివాసమైన నరేంద్రనగర్‌ ప్యాలెస్‌లో బద్రీనాథ్‌ ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. 

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బద్రీనాథ్‌ ఆలయాన్ని ప్రతి ఏడాది శీతాకాలంలో మూసివేస్తారు. అనంతరం వేసవిలో తిరిగి తెరుస్తారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఆలయ ప్రారంభానికి ముందు ఏప్రిల్‌ 29న నరేంద్రనగర్‌ ప్యాలెస్‌ నుంచి అఖండ జ్యోతి బద్రీనాథ్‌ ఆలయానికి బయలుదేరుతుంది. మే 18న జ్యోతి ఆలయానికి చేరుకోగానే వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ క్షేత్ర ద్వారాలు తెరచుకోనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని