viveka Murder case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ నిరాకరణ

వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. వివేకా హత్య కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది.

Updated : 09 Jun 2023 17:49 IST

హైదరాబాద్: వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఇటీవల భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు ఏప్రిల్‌ 16న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే.

వైద్యపరీక్షల అనంతరం ఆయన్ను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉంటున్నారు. భాస్కర్‌రెడ్డి అరెస్టుకు రెండు రోజుల ముందే ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గుజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వివేకా హత్యకు ముందురోజు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్‌ ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని