Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్‌

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్‌ మంజూరైంది.

Updated : 04 Oct 2023 00:56 IST

అమరావతి: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్‌ మంజూరైంది. రూ.25 వేల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. మంత్రి రోజాను దూషించారని బండారుపై వైకాపా నేతల ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 2న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం జీజీహెచ్‌లో బండారుకు వైద్య పరీక్షలు చేయించి మొబైల్‌ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం బండారుకు పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

బెయిల్‌పై విడుదలైన అనంతరం బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ రాజ్యాంగం పట్ల తనకు గౌరవం ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో న్యాయం జరిగిందని తెలిపారు. ‘‘ ధర్మం గెలుస్తుంది. న్యాయం గెలుస్తుంది. చంద్రబాబు కూడా త్వరగా బెయిల్‌ రావాలని కోరుకుంటున్నా. అరెస్టు చేసే సమయం నుంచి లోకేశ్‌ అండగా నిలిచారు’’ అని బండారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని