Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. ‘‘ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు. జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు నిర్వహించొద్దు. 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయొద్దు’’ అని డివిజన్ బెంచ్ ఆదేశించింది. సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్‌పై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ సతీమణి ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కౌంటరు దాఖలు చేశారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ తరఫు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రవిచందర్ ప్రస్తావించారు. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నిన్న ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Naga Chaitanya: నాగ చైతన్య రీమేక్ సినిమాపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. రంగంలోకి సీబీఐ
-
India News
Manipur: మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్పై బ్యాన్ కొనసాగింపు
-
General News
APSRTC: స్టీరింగ్ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు
-
India News
Brij Bhushan Singh: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్ భూషణ్ ఇంటికి దిల్లీ పోలీసులు
-
General News
Polavaranm-CM Jagan: పోలవరంలో సీఎం జగన్ పర్యటన