Balapur Ganesh: ఇంద్రకీలాద్రి నమూనాలో ఆకట్టుకుంటోన్న బాలాపూర్‌ గణేశ్‌ మండపం

రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో ఏర్పాటు చేసిన గణపయ్య (Balapur Ganesh) విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

Updated : 19 Sep 2023 06:20 IST

బాలాపూర్‌: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో ఏర్పాటు చేసిన గణపయ్య (Balapur Ganesh) విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈసారి పంచముఖ నాగేంద్రుడిపై 18 అడుగుల ఎత్తులో బాలాపూర్‌ గణపతి కొలువు దీరాడు. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ నమూనాలో ఈసారి మండపం తీర్చిదిద్దారు. దీంతో బాలాపూర్‌ విఘ్నేశ్వరుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

మరోవైపు, బాలాపూర్ గణేశుడి తొలిపూజలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ధూల్‌పేట్‌లోని లక్ష్మీనరసింహ కళాకారుల బృందం బాలాపూర్ గణేశుడిని తయారు చేయగా, హనీఫుడ్స్ ఉమామహేశ్వరరావు 21 కిలోల లడ్డూను వెండి గిన్నెలో నైవేద్యంగా సమర్పించారు. విశ్వకర్మ సంఘం సభ్యులు వెండి జంధ్యం బహూకరించారు. కాగా, గతేడాది వేలంపాట (Balapur Laddu Auction)లో బాలాపూర్ లడ్డూ (Balapur Laddu) రూ.24.60 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని