Bandi Sanjay: నోటీసులు వస్తే.. మహిళా కమిషన్‌ ముందు హాజరవుతా: బండి సంజయ్‌

మహిళా కమిషన్‌ నోటీసుల అంశంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. తనకు ఇంకా నోటీసులు అందలేదన్నారు. నోటీసులు వస్తే.. తప్పకుండా మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు.

Published : 11 Mar 2023 17:58 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ (womens commission) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా సంజయ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. సంజయ్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్‌.. విచారణ జరపాలని డీజీపిని ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ స్పందించారు. తనకు ఇంకా మహిళా కమిషన్‌ నుంచి నోటీసులు అందలేదన్నారు. ఒకవేళ నోటీసులు వస్తే.. తప్పకుండా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు. మరోవైపు భారాస నేతల ఆందోళనల నేపథ్యంలో నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కార్యాలయానికి వచ్చే రెండు దారుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని