తెలంగాణలో బార్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం...

Published : 10 Feb 2021 01:20 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. 18న పురపాలక సంఘాల పరిధిలో, 19న జీహెచ్‌ఎంసీ పరిధిలో లాటరీ విధానంలో లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 159 బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల గడువు ఈనెల 8న ముగిసింది. మొత్తం 7,360 దరఖాస్తులు రాగా.. చివరిరోజైన సోమవారం ఒక్కరోజే 5,311 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించి గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మొదట నిర్దేశించిన గుడువులోగా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు రుసుం కింద రూ.73.60 కోట్ల ఆదాయం సమకూరినట్లు చెప్పారు. తాజాగా గడువు పొడిగించడం ద్వారా దరఖాస్తు రుసుం కింద రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తంగా రూ. 100 కోట్ల మేర రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి..

బార్లు.. దరఖాస్తుల బారులు

TS: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని