Sonusood: రూ.కోటి ఏం సరిపోతుంది.. ఇంకాస్త ఎక్కువ అడగాల్సింది

కష్టకాలంలో ఎవరైనా సాయం చేస్తున్నారంటే చాలు.. కొందరు వాటిని ప్రశంసిస్తారు. మరికొందరు దాన్నే ఆసరాగా చేసుకొని నాకూ ‘‘ఎంతోకొంత ఇవ్వొచ్చు’’గా అంటుంటారు. కరోనా వేళ ఆపదలో ఉన్నవారందరికీ ఆపద్భాదంవుడిగా మారిన బాలీవుడ్‌ నటుడు సోనూకి.. తమను ఆదుకోండంటూ ట్విటర్‌ వేదికగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి.

Published : 25 Aug 2021 01:27 IST

నెటిజన్‌కి అదిరిపోయే రిప్లైతో పంచ్‌ ఇచ్చిన సోనూసూద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కష్టకాలంలో ఎవరైనా సాయం చేస్తున్నారంటే చాలు.. కొందరు  ప్రశంసిస్తారు. మరికొందరు దాన్నే ఆసరాగా చేసుకొని నాకూ ‘‘ఎంతోకొంత ఇవ్వొచ్చు’’గా అంటుంటారు. కరోనా వేళ ఆపదలో ఉన్నవారందరికి ఆపద్బాంధవుడిగా మారిన బాలీవుడ్‌ నటుడు సోనూకి.. తమను ఆదుకోండంటూ ట్విటర్‌ వేదికగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. దేశంలో నలుమూలల నుంచి అడిగిన వారందికీ సోనూ తోచినంత సాయం చేస్తూ వచ్చారు. తాజాగా ఓ మహేంద్ర దుర్గే అనే ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా ‘‘ సోనూ సార్‌..  ఓకోటి రూపాయలు ఉంటే ఇవ్వండి సార్‌’’ అంటూ సోనూకి ట్వీట్‌ చేయగా.. ఈ ఆకతాయికి చేష్టలకి ఆగ్రహానికి గురవ్వకుండా..‘‘ ఏం మహేంద్రా.. కేవలం రూ.కోటి ఏం సరిపోతుంది. ఇంకాస్త ఎక్కువ అడగాల్సింది’’ అంటూ లాఫింగ్‌ ఎమోజీతో పంచ్ విసిరారు. ఏమైందో ఏమో కానీ.. సోనూ ఆ ట్వీట్‌ చేసిన వెంటనే.. మహేంద్ర ఆ ట్వీట్‌ని డిలీట్‌ చేసేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన సోనూ ట్వీట్‌కు 27వేలకు పైగా లైక్స్‌ కొట్టగా.. సినిమాలో విలన్‌గా కనిపించే సోనూకి మంచి కామెడీ టైమింగ్‌ ఉందంటూ కామెంట్లు పెట్టారు.  అయితే సోనూకు ఇలాంటి అభ్యర్థనలు కొత్తేం కాదు.. గతంలోనూ PS4 వీడియో గేమ్‌ , నా గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్‌ కొనివ్వండి అంటూ ట్వీట్‌ చేసిన వారికి సోనూ ఇదే తరహాలో స్పందించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని