నాలుగు భాషలు.. ఒకటి సరిగ్గా మరొకటి రివర్స్‌లో..

రెండు చేతులతో నాలుగు భాషల్లో ఒక పదాన్ని రెండు చేతులతో ఒకటి సరిగ్గా.. మరొకటి రివర్స్‌లో రాయడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు నారాయణపేట జిల్లాకు చెందిన యువకుడు...

Updated : 26 Jan 2021 04:05 IST

ఆసియా రికార్డ్స్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

నారాయణపేట: ప్రస్తుతమున్న ఆన్‌లైన్‌ యుగంలో యువత చేతిరాతను మరిచిపోతున్నారు. చేతితో రాసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రెండు చేతులతో నాలుగు భాషల్లో ఒక పదాన్ని రెండు చేతులతో ఒకటి సరిగ్గా.. మరొకటి రివర్స్‌లో రాయడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు నారాయణపేట జిల్లాకు చెందిన యువకుడు. తన ప్రతిభతో ఆసియా రికార్డ్స్‌తోపాటు, ఇండియన్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకున్నాడు.

నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్‌కు చెందిన వాకిటి బస్వరాజ్‌ రెండు చేతులతో అతి సునాయాసంగా ఒకే పదాన్ని నాలుగు భాషల్లో రివర్స్‌గా రాసి అబ్బురపరుస్తున్నాడు. అంబులెన్స్‌పై రివర్స్‌గా రాసి ఉండటం చూసి ఆవిధంగా ప్రయత్నిద్దామని మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఒకే పదాన్ని నాలుగు భాషల్లో ఒకటి సరిగా, మరొకటి రివర్స్‌గా రాయడం అలవాటుచేసుకున్నాడు. బస్వరాజ్‌ దీన్ని ఏసియా రికార్డ్స్‌తోపాటు, ఇండియన్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించాడు. వారు ఆ ప్రతిభను గుర్తించి ఆన్‌లైన్‌లో ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రస్తుతం బస్వరాజ్‌ కర్ణాటకలోని దేవాసుగూర్‌ థర్మల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చేతిరాత ప్రత్యేకత ద్వారా ఎప్పటికైనా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాలనేదే లక్ష్యమని బస్వరాజ్‌ పేర్కొంటున్నాడు.

ఇవీ చదవండి...

జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

కుమార్తెకు ప్రేమతో..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని