
అథ్లెట్ల కోసం బ్యాటరీ మాస్కులు
దిల్లీ : భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో అథ్లెట్ల కోసం బ్యాటరీ మాస్కులు అందుబాటులోకి రానున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అయిన పియూష్ అగర్వాల్ వీటిని తయారు చేస్తున్నారు. ఈయన ఇటీవలే ప్రభుత్వ చేయూతతో మాస్కుల తయారీ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. ఇది ఐఐటీ దిల్లీతో అనుసంధానమై పని చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్ సంఘం సెక్రటరీ జనరల్ రాజీవ్‌మెహతా బ్యాటరీ మాస్కుల గురించి మాట్లాడారు. ఒక్కో దాని ధర రూ.2,200 ఉంటుందని వివరించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అథ్లెట్లు సాధన చేయటానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందు కోసం ఈ మాస్కులను రూపొందిస్తున్నట్లు రాజీవ్ తెలిపారు. ఏ ఇతర మాస్కులు అందించనంత ఆక్సీజన్‌ను బ్యాటరీతో పనిచేసే మాస్కులు అథ్లెట్లకు అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ మాస్కులకు రెండు వైపులా ఎన్-95 వాల్వ్‌లు ఉంటాయి. కుడి వైపు వాల్వ్‌లో ఉన్న ఫ్యాను బయటి గాలిని తీసుకొని వడబోసి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎడమ వైపు ఉన్న మరొక వాల్వ్‌లోని ఫ్యాన్ వ్యక్తి వదిలిన గాలిని బయటికి పంపటానికి సాయపడుతుంది. మాస్కు బ్యాటరీలు చేతికి లేదా నడుముకు కట్టుకునే ఓ తీగకు అనుసంధానం అయి ఉంటాయి. బ్యాటరీని ఒక సారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుంది. ఒలింపిక్ బరిలో ఉన్న అథ్లెట్లు తొలుత ఈ మాస్కులను వాడతారు. శ్వాస తీసుకోవడంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకపోతే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ బ్యాటరీ మాస్కుల ప్రాజెక్టు విజయవంతం అయితే భారత ఒలింపిక్ సంఘం మాస్కుల వాడకంపై ఇతర దేశాలకు సిఫార్సు చేస్తుందని రాజీవ్ తెలిపారు. వీటిని అథ్లెట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Umran Malik: ఉమ్రాన్ రాణిస్తున్నాడు.. ప్రపంచకప్ జట్టులో ఉండాలి : వెంగ్‌సర్కార్
-
General News
Weather Report: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
India News
Bypoll Results: రెండు లోక్‌సభ స్థానాల్లో ఉత్కంఠ.. భాజపా, ఎస్పీల మధ్య హోరాహోరీ
-
General News
Telangana News: 19 లక్షల రేషన్‌కార్డుల రద్దుపై దర్యాప్తు చేయండి: ఎన్హెచ్ఆర్సీకి బండి సంజయ్ ఫిర్యాదు
-
Movies News
Cash Promo: ఏం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది: గోపీచంద్
-
Crime News
Hyderabad: బాలికతో పెళ్లి చేయట్లేదని.. డీజిల్ పోసుకొని సజీవదహనం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)