Batukamma: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు.

Updated : 03 Oct 2022 21:31 IST

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వుతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. రాజధాని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది మహిళలతో హనుమకొండ పద్మాక్షి అమ్మవారి గుండం కిక్కిరిసిపోయింది. వికారాబాద్‌ జిల్లా తాండూరులో మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. కరీంనగర్‌,నల్గొండ,అదిలాబాద్‌ తదితర జిల్లాల్లో బతుకమ్మ సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు నేటితో ముగియనున్నాయి.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని