Rachakonda Police: ‘అందుకేగా అర్ధాంగి అంటారు..!’.. రాచకొండ పోలీసుల పోస్ట్‌ వైరల్‌

Rachakonda Police: ‘అందుకే కదా భార్యను అర్ధాంగి అంటారు’ అని అంటున్నారు రాచకొండ పోలీసులు. ఇంతకీ వారు ఏ విషయం గురించి చెబుతున్నారంటే..?

Updated : 19 Jun 2024 13:36 IST

హైదరాబాద్‌: ఈ మధ్య సైబర్‌ నేరాలు (Cyber Crimes) విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ మోసాల గురించి మరింత అర్థవంతంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు (Rachakonda Police)ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్‌ జోక్‌తో ప్రజలను హెచ్చరించారు. ‘‘బ్యాంకు అకౌంట్‌ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి.. తెలివిగా ఆలోచించండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని