Vizag: విశాఖలో ‘సాగర తీర స్వచ్ఛత’.. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు

సముద్ర తీరంలోని వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని...

Updated : 26 Aug 2022 13:32 IST

తీరంలోని పరిసరాలను శుభ్రం చేసిన మంత్రులు సురేశ్‌, అమర్‌నాథ్‌

విశాఖపట్నం: సముద్ర తీరంలోని వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. ‘సాగర తీర స్వచ్ఛత’ కార్యక్రమంలో భాగంగా విశాఖ తీరంలోని కాళీమాత దేవాలయం ఎదురుగా పరిసరాలను మంత్రులు, నగర మేయర్‌ గొలగాని వెంకటహరికుమారి, జిల్లా కలెక్టర్, నగర పోలీస్‌ కమిషనర్‌ తదితరులు శుభ్రం చేశారు. 

ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. దీనిలో భాగంగానే అమెరికాకు చెందిన పార్లే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ‘సాగర తీర స్వచ్ఛత’ కార్యక్రమం సందర్భంగా నేవీ హెలికాప్టర్‌ ద్వారా చేపట్టిన జాతీయ పతాకాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని