Oats: రోజూ ఆహారంలో ఓట్స్‌ తీసుకుంటున్నారా? ఈ ప్రయోజనాలు తెలుసా?

ఓట్స్‌ను అల్పాహారంగా చేసుకోవటం వల్ల ఎన్నో లాభాలను కూడా పొందవచ్చు. కేవలం అల్పాహారంగానే కాకుండా వివిధ రకాలుగా కూడా ఓట్స్‌ను తినవచ్చు.

Published : 01 Oct 2022 02:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉదయం అల్పాహారం అనగానే ఇడ్లీ, దోశ, పూరి.... ఇలాంటివే గుర్తుకొస్తాయి. కానీ, ఇవి కాకుండా అనేక రకాల టిఫిన్లు చేసుకునే వెసులుబాటు ఉంది. అందులో ఓట్స్‌ ఒకటి. అవునండీ ఓట్స్‌ను అల్పాహారంగా చేసుకోవటం వల్ల ఎన్నో లాభాలను కూడా పొందవచ్చు. కేవలం అల్పాహారంగానే కాకుండా వివిధ రకాలుగా కూడా ఓట్స్‌ను తినవచ్చు. అసలు ఈ ఓట్స్‌ ఎందుకు తినాలి? ఓట్స్‌ వల్ల కలిగే లాభాలేంటో మీరూ తెలుసుకోండి. 

* ఉదయం అల్పాహారంగా తీసుకునేందుకు ఓట్స్‌ మంచి ఆహారం. ఒక కప్పు(81 గ్రాములు) ఓట్స్‌లో ప్రోటీన్‌ 10.7గ్రా, కార్బోహైడ్రేట్స్‌ 54.8గ్రా, చక్కెర శాతం 0.8గ్రా, ఫైబర్‌ 8.1గ్రా, కొవ్వు 5.3గ్రా ఉంటాయి.

* మధుమేహం ఉన్నవాళ్లు ఈ ఓట్స్‌ హాయిగా తినేయచ్చు. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఓట్స్‌ తింటే మంచి ఫలితాలుంటాయి. 

* ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాన్ని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. 

* ఓట్స్ శరీరంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతాయి. 

* శరీరానికి ఓట్స్‌ మెలటోనిన్‌ హార్మోన్‌ను అందిస్తుంది. దీంతో బాగా నిద్రపడుతుంది.  

* ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తుంది. 

* ఓట్స్‌లో ఉండే మినరల్స్‌ ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

* ఇందులోని జింక్‌ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts