IT: సీట్ల కేటాయింపు ఎలా జరిగింది?.. భద్రారెడ్డిని ప్రశ్నించిన ఐటీ అధికారులు

ఆదాయపన్నుశాఖ కార్యాలయంలో విచారణకు మరోసారి మంత్రి మల్లారెడ్డి రెండో కుమారుడు భద్రారెడ్డి హాజరయ్యారు. ఆయనను అధికారులు రెండోసారి ప్రశ్నించారు.

Published : 02 Dec 2022 19:35 IST

హైదరాబాద్‌: ఆదాయపన్నుశాఖ కార్యాలయంలో విచారణకు మరోసారి మంత్రి మల్లారెడ్డి రెండో కుమారుడు భద్రారెడ్డి హాజరయ్యారు. ఆయనను అధికారులు రెండోసారి ప్రశ్నించారు. కళాశాలలో సీట్ల కేటాయింపుపై ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు భద్రారెడ్డి సమాధానాలు చెప్పారు. మొదటి రోజు విచారణలో భాగంగా ఐటీ అధికారుల ప్రశ్నలకు సరైన వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి ఐటీ అధికారులు తమకు కావాల్సిన ఫార్మాట్‌లో వివరాలు తీసుకురావాలని గత విచారణలో భద్రారెడ్డికి చెప్పారు. ఈమేరకు ఆయన రెండోసారి విచారణకు హాజరై ఆదాయపన్నుశాఖ అడిగిన పత్రాలను సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని