TS News: భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా తెప్పోత్సవం

భద్రాచలం రామాలయంలో బుధవారం సాయంత్రం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. భక్తరామదాసు కాలం నుంచి పవిత్ర గోదావరిలో ఈ ఉత్సవం చేస్తున్నారు. ముక్కోటి

Updated : 12 Jan 2022 20:22 IST

భద్రాచలం: భద్రాచలం రామాలయంలో బుధవారం సాయంత్రం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. భక్తరామదాసు కాలం నుంచి పవిత్ర గోదావరిలో ఈ ఉత్సవం చేస్తున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశికి ముందు రోజు సాయంత్రం దీన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కరోనా ఆంక్షల నేపథ్యంలో గోదావరిలో ఈ వేడుక చేయలేదు. బేడా మండపం సమీపంలోని పుష్కరిణిలో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తులను అనుమతించకుండా నిరాడంబరంగా వేడుకలు చేశారు. గోదావరి నుంచి తీర్థబిందెలు తీసుకొచ్చి సంప్రోక్షణ చేశారు. స్వామి, అమ్మవారి విగ్రహాలను మేళతాళాల మధ్య ప్రధాన ఆలయం నుంచి మండపానికి తీసుకువచ్చారు. అనంతరం రాములోరిని హంసవాహనంపై ఉంచి తెప్పోత్సవ పూజలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని