భద్రాద్రిని టెంపుల్‌ సిటీ చేయాలి: పువ్వాడ

భద్రాద్రిని టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కోరారు

Updated : 30 Jan 2021 16:50 IST

భద్రాచలం: భద్రాద్రిని టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కోరారు. భద్రాచలంలో ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా  భద్రాద్రిని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పువ్వాడ కోరారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు.కుట్ర పూరితంగా 7 మండలాలను ఏపీలో కలిపారని ఆరోపించారు. ఆలయానికి చెందిన 1,800 ఎకరాల భూమిని ఏపీలో కలిపారని విమర్శించారు. కనీసం ఆరు గ్రామాలను మళ్లీ భద్రాచలంలో కలపాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. దీని కోసం కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. యాదాద్రి తర్వాత భద్రాద్రిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని, రూ.100 కోట్లతో భద్రాద్రి అభివృద్ధి చేసే ఆలోచనలో సీఎం ఉన్నారని వెల్లడించారు. అనంతరం జీసీసీలో సబ్బులు, షాంపూ తయారీ యూనిట్‌ను మంత్రులు పువ్వాడ, సత్యవతి, శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు.
ఇవీ చదవండి..
వైకాపా పాలనలో వలసలు పెరిగాయి: తెదేపా

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి:ఎస్‌ఈసీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు