TTD: తితిదే ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు

యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు భగవద్గీత కంఠస్థ పోటీలను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్వహించనుంది.

Published : 10 Nov 2021 23:43 IST

తిరుమల: యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు భగవద్గీత కంఠస్థ పోటీలను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్వహించనుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 5న ఈ పోటీలు జరగనున్నట్లు తితిదే ప్రకటించింది. జూనియర్ విభాగంలో 6, 7 తరగతుల విద్యార్థులు, సీనియర్ విభాగంలో  8, 9 తరగతులవారికి పోటీలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో.. జిల్లాస్థాయిలో ఈ పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి గీతా జయంతిని పురస్కరించుకొని డిసెంబరు 14న బహుమతులు ప్రదానం చేయనున్నారు. జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో డిసెంబరు 29న రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు. అభ్యర్థులు నవంబరు నెలాఖరులోగా జిల్లా కేంద్రాల్లోని తితిదే కల్యాణ మండపాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు