Covaxin: కొవాగ్జిన్‌ రూపంలో చిన్నారి.. అభినందించిన భారత్‌ బయోటెక్‌

కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు వచ్చిన తరుణంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సంస్థ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల తోపాటు ఉద్యోగులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు...

Updated : 06 Nov 2021 14:49 IST

హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు వచ్చిన తరుణంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సంస్థ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లతో పాటు ఉద్యోగులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవాగ్జిన్‌ రూపంలో విధాత్రి అనే చిన్నారితో రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. సంతోషకరంగా ఉందన్న భారత్‌ బయోటెక్‌.. కొవాగ్జిన్‌ మస్కట్‌గా వ్యవహరించిన విధాత్రికి ధన్యవాదాలు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని