Telangana News: దుష్ట శక్తులను సమాజానికి దూరంగా పెట్టాలి: వెంకయ్యనాయుడు

మన చరిత్రను వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలా రాసుకోవాల్సిన అవసరముందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత మాత మహాహారతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

Updated : 22 Jan 2023 22:29 IST

హైదరాబాద్‌: మన చరిత్రను వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలా రాసుకోవాల్సిన అవసరముందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా వద్ద కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతమాత మహాహారతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దేశ సంస్కృతిని యువత తెలుసుకుని స్ఫూర్తి పొందాలని వెంకయ్య నాయుడు సూచించారు. కన్నతల్లి, అమ్మ భాష మర్చిపోకూడదన్న ఆయన.. కులం, మతం వర్గం పేరిట ఉండే దుష్ట శక్తులను దూరంపెట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దాదాపు 3 వేల మంది బాలికలు భారతమాత వేషధారణలో వచ్చి దేశ భక్తి, స్ఫూర్తి రగిల్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. భారతమాతకు హారతి ఇచ్చేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఆరేళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని