Viveka Murder case: సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భాస్కర్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి గురువారం సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి గురువారం సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 16 నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉన్న భాస్కర్‌రెడ్డి బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
భాస్కర్ రెడ్డి అరెస్టు సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు పేర్కొన్నారు. ‘ఈకేసులో కీలక సాక్షులను అనుచరుల ద్వారా ప్రభావితం చేస్తున్నారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు భాస్కర్‌రెడ్డి ప్రయత్నించారు. విచారణకు సహకరించడం లేదు. విచారణకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదముందనే అరెస్టు చేశాం. విచారణను తప్పుదోవ పట్టించేలా భాస్కర్‌రెడ్డి జవాబులు ఇచ్చారు. వైఎస్ వివేకాపై భాస్కర్‌రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉంది. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వీరి మధ్య వివాదం ఉంది. హత్యాస్థలంలో ఆధారాలు చెరిపేయడంలో భాస్కర్‌రెడ్డిది కీలక పాత్ర. నెల ముందే వివేకా హత్యకు కుట్రపన్నారు. భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే హత్యకు కుట్ర జరిగింది. వివేకా హత్యలో సహ నిందితులకు పెద్దమొత్తంలో డబ్బు అందింది. సీఐ శంకరయ్యను భాస్కర్‌రెడ్డి బెదిరించారు’’ అని సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం