Bhatti vikramarka: ‘రైతుభరోసా’ ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాం: భట్టి విక్రమార్క

వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Published : 10 Jul 2024 12:48 IST

ఖమ్మం: వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీని అమలు చేయడం కోసం తమ ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. రైతుభరోసా పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని