Snake: కాటేసిన పామునే నమిలేశాడు.. ఆ తర్వాత ఏం జరిగింది?

పాము మనిషిని కాటేయడం సాధారణం.. మనిషే కోపంతో పాముని ముక్కలుగా కొరకడం అసాధారణం. బిహార్‌లోని

Updated : 09 Aug 2021 19:23 IST

బిహార్‌: పాము మనిషిని కాటేయడం సాధారణం.. మనిషే కోపంతో పాముని ముక్కలుగా కొరకడం అసాధారణం. బిహార్‌లోని నలంద జిల్లాలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో చివరికి ఆ వ్యక్తి చనిపోవడం దురదృష్టకరం. మాధోపూర్‌ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామా మహతోనిని శనివారం రాత్రి ఒక పాము కాటేసింది. దాంతో కోపంతో ఊగిపోయిన మహతో ఆ పాముని వెంటాడి పట్టుకున్నాడు. కసిదీరా కొరికి కొరికి దాన్ని చంపేశాడు. ఇంటిపక్కనే ఉన్న చెట్టుపై వేలాడదీశాడు. దీన్ని గమనించి కొందరు గ్రామస్థులు వారించినా వినలేదు. కనీసం ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని బతిమిలాడినా ‘పాముని చంపేశాను కదా.. నాకేం కాదులే’ అంటూ పెడచెవిన పెట్టాడు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున స్పృహ తప్పి పడి పోయి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే తను చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని