అభ్యర్థి చనిపోయిన విషయం దాచారు.. అయన్నే గెలిపించారు!

బిహార్‌లో విస్తుగొలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి మృతి చెందిన విషయాన్ని దాచి ఉంచి, అతన్నే గెలిపించారో గ్రామస్థులు.....

Published : 28 Nov 2021 01:28 IST

పట్నా: బిహార్‌లో విస్తుగొలిపే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి మృతి చెందిన విషయాన్ని దాచి ఉంచి, అతన్నే గెలిపించారు ఆ గ్రామస్థులు. గెలుపు పత్రం అందజేసే సమయంలో తీరా అభ్యర్థి కనిపించకపోవడంతో.. ఆరా తీయగా అసలు విషయం తెలుసుకుని అధికారులు కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని జముయ్‌ జిల్లా మారుమూల గ్రామమైన దీపకర్హార్‌లో సోహన్‌ ముర్ము అనే అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిల్చున్నారు. అయితే నవంబరు 6వ తేదీనే సోహన్‌ మృతి చెందారు. ఇది జరిగిన రెండు వారాలకు ఎన్నికలు జరగ్గా ఆయన గెలుపొందారు.

చివరి కోరిక నెరవేర్చేందుకే..

ఎన్నికల్లో గెలుపొందడమే ముర్ము చివరి కోరిక అని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. అందుకే మృతిచెందిన విషయాన్ని బయటకు చెప్పలేదని తెలపడం గమనార్హం. గ్రామస్థులు సైతం ఈ విషయంపై సమాచారం ఇవ్వలేదని ఇక్కడి బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. ముర్ము చివరి కోరికను నెరవేర్చేందుకు వారంతా ఆయనకు అనుకూలంగా ఓటు వేసినట్లు కనిపిస్తోందని అధికారి తెలిపారు. ఈ క్రమంలో సంబంధిత ఎన్నికను రద్దు చేసి.. మరోసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికలకు లేఖ రాస్తామని త్రిపాఠి చెప్పారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని