Bill Gates: మైక్రోసాఫ్ట్‌ 47 ఏళ్ల వేడుక.. బిల్‌గేట్స్‌ అదిరిపోయే స్టంట్‌

మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి 47 ఏళ్లు అయిన సందర్భంగా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు బిల్‌గేట్స్‌.......

Published : 06 Apr 2022 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి సోమవారం నాటికి 47 ఏళ్లు. బిల్‌గేట్స్‌తో పాటు, ఆయన చిన్ననాటి స్నేహితుడు పాల్‌ ఆల్లెన్‌ 1975 ఏప్రిల్‌ 4న స్థాపించారు. కాగా ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని, గత స్మృతులను గుర్తుచేసుకుంటూ మాజీ సీఈఓ బిల్‌గేట్స్‌ ఓ పాత వీడియోను పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌లోనే ఏళ్ల క్రితం ఓ కుర్చీపైనుంచి అవతలివైపు దూకుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘ప్రతి ఇంటిలో, ప్రతి డెస్క్‌పై కంప్యూటర్‌ ఉంచేందుకు చేసిన ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి, సంస్థ మరింత పురోగతి సాధించేందుకు సంస్థ కృషి చేస్తున్నందుకు గర్వపడుతున్నా’ అంటూ రాసుకొచ్చారు.

బిల్&మెలిండా గేట్స్ ఫౌండేషన్ దాతృత్వ పనులపై దృష్టి పెట్టాలనుకున్న గేట్స్‌ 2000 సంవత్సరంలోనే మైక్రోసాఫ్ట్‌ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. 2008 నుంచే సంస్థలో పూర్తిస్థాయి కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన.. 2020 మార్చి వరకు బోర్డు సభ్యుడిగా కొనసాగాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని