Published : 25 Feb 2022 01:40 IST

BioAsia: భవిష్యత్తులో అనేక వైరస్‌లు దాడి చేయవచ్చు: బిల్‌గేట్స్‌

హైదరాబాద్‌: బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ పాల్గొన్నారు. దృశ్య మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులో ఆయనతో పాటు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పాల్గొని చర్చాగోష్ఠి నిర్వహించారు. సదస్సు మొదటి రోజు బిల్‌గేట్స్‌, మంత్రి కేటీఆర్‌ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.  కొవిడ్‌ పాండమిక్‌ ఆరోగ్య రంగంపై విసిరిన సవాళ్లు, గ్లోబల్‌గా పలు దేశాలు స్పందించిన తీరుపై ఇరువురూ చర్చించారు. బాగా అభివృద్ధి చెందిన దేశాల వ్యాక్సిన్ల కన్నా భాతర వ్యాక్సిన్లు ప్రభావవంతంగా నిలిచాయని, వ్యాక్సిన్ల అభివృద్ధి, పంపిణీలో భారత కంపెనీలు వేగంగా స్పందించాయని బిల్‌ గేట్స్‌ కితాబిచ్చారు. కొవిడ్‌ వ్యాక్సిన్లతో పాటు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల కొరకు భారత్‌ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చారని, భవిష్యత్తులో మహమ్మారులు ప్రబలితే భారత్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్లతో కలిసి పనిచేస్తామని బిల్‌గేట్స్‌ అన్నారు. 
కేటీఆర్‌,  బిల్‌గేట్స్‌ మధ్య సంభాషణ సాగిందిలా...

కేటీఆర్‌: భవిష్యత్తు పాండమిక్స్‌ను ఎలా ఎదుర్కోవాలి?

బిల్‌గేట్స్‌: డయాగ్నోస్టిక్స్‌, థెరపెటిక్స్‌ అభివృద్ధి చెందాలి. ఆర్‌అండ్‌డీపై ప్రపంచదేశాలు ఎక్కువ ఇన్వెస్టు చేయాలి. ఫ్యూచర్‌ పాండమిక్‌ రెడీనెస్‌పై పుస్తకం రాస్తున్నా.

కేటీఆర్‌: మీ బిజీ టైమ్‌లో సమయం ఎలా కేటాయించగలుగుతున్నారు?

బిల్‌గేట్స్‌: ఇప్పటికే వాతావరణ మార్పులపై ఒక పుస్తకం రాశా. ఇది నా రెండో పుస్తకం.

కేటీఆర్‌: సూక్ష్మజీవుల ద్వారా వ్యాప్తి చెందే రోగాల నియంత్రణకు ఎలాంటి సన్నద్ధత అవసరం?

బిల్‌గేట్స్‌: క్యాన్సర్‌, గుండె జబ్బులకన్నా ఇన్‌ఫెక్టెడ్‌ వ్యాధులు ప్రమాదకరం. ముఖ్యంగా భారత్‌  వంటి దేశాలకు వ్యాప్తి చెందే వ్యాధులు పెను సవాలు విసురుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం ప్రభావం చూపుతుంది. పరిశోధన వాల్యూం హైక్‌ ద్వారా ఆరోగ్య సదుపాయాలను అందుబాటు ధరలోకి తీసుకువచ్చే ప్రయత్నం గ్లోబల్‌గా జరగాలి.

కేటీఆర్‌: హెల్త్‌లో టెక్నాలజీ ప్రాధాన్యమేంటి?

బిల్‌గేట్స్‌: సాంకేతికత సాయంతో ఆరోగ్య రంగంలో సేవలు సులభతరమవుతాయి. అప్పుడు ప్రతీ అవస్థకు రోగి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా రిమోట్‌గానూ కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. డయాగ్నోస్టిక్స్‌ విషయానికి వస్తే బీపీ, షుగర్‌ మానిటర్లు, స్మార్ట్‌ వాచెస్‌ లాంటివి ఈ కోవలోనివే.

కేటీఆర్‌: ఆరోగ్య రంగంలో మీ తదుపరి బాధ్యత ఏమిటి?

బిల్‌గేట్స్‌: హెచ్‌ఐవీ నియంత్రణ, పిల్లల్లో పోషకాహార లోపంపై వచ్చే పదేళ్లలో మా ఫౌండేషన్‌ కృషి చేస్తుంది. పోషకాహర లోపం లేని సమాజమే.. రేపు అభివృద్ధి చెందిన పౌరులను, దేశాన్ని తీర్చిదిద్దుతుంది.

కేటీఆర్‌: మీరు హైదరాబాద్‌ను సందర్శించాలి. మీరు భవిష్యత్తులో సందర్శించే హైదరాబాద్‌ నగరం పూర్తి నవీన, అభివృద్ధి చెందిన కొత్త రకమైన అనుభూతినిస్తుంది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని