సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం ఆయన పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ..
ఇంటర్నెట్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం ఆయన పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమ, అభిమానాలు కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.
- ప్రధానమంత్రి నరేంద్రమోదీ
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుకు సాగాలి.
- ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ముందుకు సాగాలి.
- తమిళి సై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్
పచ్చదనాన్ని ప్రేమించే కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటడమే మనమిచ్చే కానుక. అందరం మొక్కలు నాటుదాం.. పరిరక్షించే బాధ్యత తీసుకుందాం.
- ప్రముఖ సినీనటుడు చిరంజీవి
సీఎం కేసీఆర్‌కు ఆయన తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్. అందరిలో స్ఫూర్తి నింపిన ఉద్యమకారుడు. విజనరీ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్’’.
-కేటీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా.
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా.
-కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలి.
-తెదేపా అధినేత చంద్రబాబు
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలి.
- జనసేన అధినేత పవన్ కల్యాణ్
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలి.
-సినీనటుడు మహేశ్‌బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?