
Offbeat: జన్ను సుబ్బమ్మ @ 110... సూపర్ కదా!
చెరుకుపల్లి: గుంటూరు జిల్లాకి చెందిన ఓ శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. చెరుకుపల్లి మండలం పడమటపాలెం గ్రామానికి చెందిన జన్ను సుబ్బమ్మ 110 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 111వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆ వృద్ధురాలి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఉత్సాహంగా జరుపుకొన్నారు. సుబ్బమ్మకి ఆరుగురు కుమారు, ముగ్గురు కుమార్తెలు సంతానం. ప్రస్తుతం ఐదు తరాల వారికి సుబ్బమ్మ పెద్దదిక్కుగా ఉన్నారు. కుమారులు, కుమార్తెలు, మనువలు, మనుమరాళ్లు ఇలా.. ఐదుతరాల వారందరూ ఒక్క చోటికి చేరి వేడుకలో పాల్గొన్నారు. వృద్ధురాలితో కేక్ కట్ చేయించి అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామంలో స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ ఒక్క చోట చేరి ఇలా పుట్టిన రోజు వేడుక నిర్వహించడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 111 ఏళ్లు వచ్చినా సుబ్బమ్మ తన పనులు తానే చేసుకుంటుందని, 40 ఏళ్లుగా ఒంటిపూట భోజనం చేస్తుందని తెలిపారు.