TS News: రేపు తెలంగాణ వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు

తెలంగాణ భాజపా శాఖ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు

Published : 09 Jan 2022 13:41 IST

హైదరాబాద్‌: తెలంగాణ భాజపా శాఖ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్న నేపథ్యంలో భాజపా శ్రేణులు హోమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో హోమాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సూచించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు చేపట్టాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో సంజయ్‌ పాల్గొననున్నారు. మరోవైపు పంజాబ్‌ ఘటనను నిరసిస్తూ భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌ చేరుకున్న అసోం సీఎం

అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వరంగల్‌లో నిర్వహించనున్న భాజపా సభలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని