Black Dahlia: బ్లాక్ డహ్లియా.. ఓ అంతు చిక్కని హత్య!
ప్రపంచంలో ఎన్నో చిక్కువీడని హత్య కేసులు ఉన్నాయి. వాటిలో దశబ్దాల కిందట అమెరికాలో సంచలనం సృష్టించిన బ్లాక్ డహ్లియా హత్య కేసు ఒకటి. ఆమె ఏమీ పెద్ద సెలబ్రిటీ కాదు, రాజకీయ నాయకురాలూ కాదు. కానీ.. ఆమె హత్యకు గురైన తీరు..
(Photo: fbi.gov)
ప్రపంచంలో ఎన్నో చిక్కువీడని హత్య కేసులు ఉన్నాయి. వాటిలో దశబ్దాల కిందట అమెరికాలో సంచలనం సృష్టించిన బ్లాక్ డహ్లియా హత్య కేసు ఒకటి. ఆమె ఏమీ పెద్ద సెలబ్రిటీ కాదు, రాజకీయ నాయకురాలూ కాదు. కానీ.. ఆమె హత్యకు గురైన తీరు, కేసు దర్యాప్తు, ఆమెను చంపిన హంతకుడిని నేనే అంటూ వందలాది మంది పోలీసులకు లొంగిపోయిన ఘటనలు, వారిలో ఏ ఒక్కరూ హంతకులుగా తేలకపోవడం, దశాబ్దాలు గడిచినా అసలు హంతకుడు దొరకకపోవడంతో ఈ కేసు అమెరికా వ్యాప్తంగా సంచలనమైంది. ఇంతకీ ఆమె ఎవరు? హత్య ఎలా జరిగింది? హంతకుడెవరై ఉండవచ్చు?
ఎలిజబెత్ షార్ట్.. బోస్టన్‌లో 1924లో జన్మించింది. 18 ఏళ్లు నిండిన తర్వాత తల్లి దగ్గర నుంచి కాలిఫోర్నియాలో ఉండే తండ్రి వద్దకు వచ్చింది. అక్కడ ఆమెకు ఆయనతో విభేదాలు రావడంతో బయటకు వెళ్లిపోయింది. నటి అవ్వాలన్న కోరికతో లాస్ ఏంజిలస్ చేరుకుంది. చిరుద్యోగం చేసుకుంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండేది. ఉన్నట్టుండి 1947 జనవరి 9న కనిపించకుండా పోయింది. ఆరు రోజుల తర్వాత అంటే జనవరి 15న లీమెర్ట్ పార్క్ వద్ద ఆమె మృతదేహం కనిపించింది. అటుగా వెళ్తున్న ఓ మహిళ.. ఎలిజబెత్ మృతదేహం పడి ఉన్న తీరు చూసి భయపడిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె మృతి చెందిన వార్త వెలుగులోకి వచ్చింది.
శరీరం రెండు భాగాలైంది.. చుక్క రక్తం లేదు!
ఎలిజబెత్‌ను హంతకులు అతి కిరాతకంగా హత్య చేశారు. నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని రెండు ముక్కలుగా నరికారు. పెదాలను చెక్కి.. ముఖం నవ్వుతూ కనిపించేలా దవడలను చీల్చారు. ఒంటి నిండా తీవ్రమైన గాయాలున్నాయి. కానీ, మృతదేహం పడి ఉన్నచోట రక్తపు మరకలేవీ లేవు. మృతదేహం పాలిపోయి తెల్లగా మారిపోయింది. దీన్నిబట్టి.. హంతకులు ఆమెను తీవ్రంగా హింసించి చంపి, రక్తమంతా తొలగించి మృతదేహాన్ని తీసుకొచ్చి పడేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. గతంలో ఎలిజబెత్ ఓ చిన్న కేసులో పోలీసులకు చిక్కడంతో అప్పుడు తీసుకున్న వేలిముద్రల ఆధారంగా మృతదేహం ఆమెదేనని పోలీసులు గుర్తించారు. కాగా.. హత్యకు గురైన తీరుతో ఎలిజబెత్ కేసు అందరికీ ఉత్కంఠగా మారింది.
బ్లాక్ డహ్లియా కేసుగా ఎలా మారింది?
ఎలిజబెత్ మృతి చెందడానికి ముందు ఏడాది అంటే 1946లో ‘ది బ్లాక్ డహ్లియా’అనే మర్డర్ మిస్టరీ సినిమా విడుదలైంది. అందులో ఓ మహిళ హత్యకు గురవుతుంది. ఆమెని హత్య చేసిన వాణ్ని ఎలా పట్టుకున్నారేది కథ. ఎలిజబెత్ కూడా అలాగే హత్యకు గురికావడం, హంతకుడు పోలీసులకు చిక్కకుండా పారిపోవడంతో ప్రజలు ఎలిజబెత్ హత్య ఘటనను సినిమాతో పోల్చారు. అలా ఆమెను బ్లాక్ డహ్లియాగా.. కేసును బ్లాక్ డహ్లియా కేసుగా పిలువసాగారు. దీంతో పోలీసులు అధికారికంగానూ ఈ కేసును బ్లాక్‌డహ్లియా కేసుగా మార్చారు.
నేనే హంతకుడినంటూ 500 మంది..
బ్లాక్ డహ్లియా కేసు సంచలనంగా మారడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించిన మరుసటి రోజు నుంచే దర్యాప్తు ముమ్మరం చేశారు. అనేక మందిని విచారించారు. అయితే, కేసు దర్యాప్తు ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 60 మంది ఎలిజబెత్‌ను తామే చంపామంటూ పోలీసులకు లొంగిపోయారు. విచారణలో వారు హంతకులు కాదని తేలడంతో వదిలిపెట్టారు. హత్య జరిగి ఏళ్లు గడిచినా కేసును మాత్రం ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారు. అప్పుడప్పుడు ఎలిజబెత్‌ను హత్య చేసింది తానేనంటూ కొంతమంది పోలీసుల వద్దకు వచ్చేవారు. అలా ఇప్పటి వరకు దాదాపు 500 మంది వరకు నేరం తామే చేశామంటూ పోలీసుల ముందు ఒప్పుకున్నారట. కానీ, దర్యాప్తులో వాళ్లెవరూ హంతకులు కాదని తేలింది. విచిత్రమేమిటంటే.. హంతకుడిని నేనే అంటూ వచ్చిన వారిలో కొంత మంది హత్య జరిగిన నాటికి పుట్టనేలేదు.
ఇప్పటికీ తేలని కేసుగా..
ఆరు దశాబ్దాలు గడిచిపోయినా.. ఎలిజబెత్‌ను చంపిన హంతకుడెవరో పోలీసులు కనిపెట్టలేకపోయారు. కొంతమంది సీరియల్ కిల్లర్లను గుర్తించి నిందితుల జాబితాలో చేర్చారు. కానీ, వారు హత్య చేయలేదని తేలింది. మరి కొంతమంది ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంత ప్రయత్నించినా హంతకుడు దొరక్కపోవడంతో ఈ కేసు అమెరికా చరిత్రలోనే చిక్కు వీడని, దారుణ హత్య కేసుగా మిగిలిపోయింది. దీంతో బ్లాక్ డహ్లియా హత్య కేసుపై ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ పుస్తకాలు కూడా విడుదలయ్యాయి.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: లైంగిక వాంఛ తీర్చాలని అర్ధరాత్రి వేధింపులు.. కత్తితో పొడిచి చంపిన యువతి
-
India News
పండగ వేళ విషాదం.. ఆలయంలో మెట్లబావిలో పడిన భక్తులు
-
General News
Sri Rama Navami: భద్రాచలంలో వైభవంగా రాములోరి కల్యాణోత్సవం
-
India News
Shashi Tharoor: నిర్మలాజీ.. మీరు గ్రేట్.. ఆ పాప కోసం రూ. ఏడు లక్షలు వదిలేశారు!
-
Crime News
Tanuku: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. దగ్ధమైన చలువ పందిరి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు