Black Fungus: ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది

బ్లాక్‌ ఫంగస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దంతాలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంతాల్లో సమస్య అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాథమిక

Published : 21 May 2021 17:08 IST

దంత వైద్య నిపుణులు డా.ఎం.ప్రతాప్‌

బ్లాక్‌ ఫంగస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దంతాలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంతాల్లో సమస్య అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాథమిక దశలోనే బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించవచ్చని అంటున్నారు దంత వైద్య నిపుణులు ఎం.ప్రతాప్‌. తద్వారా చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలున్నాయని.. నిర్లక్ష్యం చేస్తే మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు ఉంటే బ్లాక్‌ ఫంగస్‌గా గుర్తించాలి, ఒకవేళ లక్షణాల ఆధారంగా ఎలాంటి చికిత్స ఉంటుంది. రాకుండా ఉండాలంటే ఏమి చేయాల్లో ఆయన మాట్లాలోనే..

బ్లాక్‌ ఫంగస్‌కు సంబంధించి దంతాల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

అప్పటి వరకూ పంటి సమస్యలు లేని వారి పళ్లు కదులుతున్నట్లు అనిపిస్తుంది. చిగురుల్లో, పెదవిపై, నోటి లోపల బుగ్గలపైన పుళ్లు ఏర్పడతాయి. ఇలా వచ్చినప్పుడు బ్లాక్‌ డిస్‌కలరేషన్‌ (నలుపురంగులో మారడం) ఉంటుంది. అంతే కాకుండా చిగుర్లలో పంటి ఎముక లోపల, పై భాగంలో చిగుర్ల నుంచి వాపు, చీము కారడం, రక్తం కారడం ముఖ్యంగా కనిపిస్తుంది. ఈ నోటిలోకి బ్లాక్‌ ఫంగస్‌కి ముఖ్య లక్షణాలు ఇవే. కొందరికి అంగలి(ప్యాలెట్‌) పై భాగంలో నల్లగా, బొగ్గలా తయారవుతుంది. ముక్కు నుంచి కొన్నిసార్లు ద్రవంగా కారడం, నల్లటి పదార్థం ముక్కు నుంచి బయటకు రావడం, ముక్కు నుంచి బ్లీడింగ్‌ అవ్వడం.. కొందరికి తలనొప్పి, దవడ వాపు రావడం.. ఈ వాపును అశ్రద్ధ చేస్తే కంటి కింది భాగంలోకి చేరి.. కంటి ఎముకలోపల పోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కళ్లు ఎర్రగా అవ్వడం, కంటి రెప్పల వాపు, కళ్లు మూసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇవి చెవి, నోటి, ముక్కు నుంచి ముఖ్యంగా పైకి వెళ్లి కంటిపై నుంచి మెదడుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.

షుగర్‌ లేని వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందా? వస్తే ఎవరెవరికి వస్తుంది?

రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి బ్లాక్‌ఫంగస్‌ బారిన పడే అవకాశాలెక్కువ. గతంలో కూడా ఈ వ్యాధి ఉండేది, కానీ వాటి సంఖ్య ఇప్పటితో పోలిస్తే అప్పుడు తక్కువ. ఇప్పుడీ కరోనా వచ్చాక కొందరికి రోగనిరోధక శక్తి తగ్గడం, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్‌ ఇవ్వడం.. ఆ స్టిరాయిడ్స్‌ వాడినందుకు డయాబెటిక్స్‌ అదుపులో లేని వారికి.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ బ్లాక్‌ఫంగస్‌ వచ్చే అవకాశాలెక్కువ. గతంలో క్యాన్సర్‌, అవయవ మార్పిడి చేసిన వారు, టీబీ, హెచ్‌ఐవీ, తరచూ పొగతాగే వారు... వాళ్లకి షుగర్‌లేకున్నా.. ఈ వ్యాధి బారిన పడే అవకాశాలెక్కువ.

కుటుంబంలో ఒకరికి వస్తే.. మిగిలిన వారికి వ్యాపించే అవకాశం ఉంటుందా?

ఇది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకదు. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి విస్తరించడం, శరీరంలోని చాలా భాగాలకు ఈ ఫంగస్‌ చేరే అవకాశాలెక్కువ. నోరు, ముక్కు, మెదడు, కంటి ద్వారా దీని ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందునుంచి కావాల్సిన సర్జికల్‌ డిబ్రేడ్‌మెంట్‌, లైఫొజోమల్‌ యాంఫొటరీ సింబే ఇంజెక్షన్స్‌, అండర్‌లైయింగ్‌ వ్యాధుల్ని అదుపులోకి తీసుకురావడం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ని తొందరగా గుర్తిస్తే మంచి చికిత్స మనం ఇవ్వగలుగుతాం.

ఏ జాగ్రత్తలు తీసుకుంటే బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా జాగ్రత్త పడొచ్చు?

కరోనా వచ్చిన వారు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి. అపరిశ్రుభ వాతావరణంలో ఉండటం వల్ల, వ్యక్తిగత పరిశుభ్రం లేకపోవడం వల్ల ఈ బ్లాక్‌ ఫంగస్‌ ఎక్కువగా వస్తుంది. కొందరికి స్టిరాయిడ్స్‌ ట్యాబ్లెట్స్‌ ఇచ్చినప్పుడు షుగర్‌ పరీక్షలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డయాబెటిక్‌ లేనివారు కూడా కొవిడ్‌ ఇండ్యూస్డ్‌ డయాబెటిక్‌.. కరోనా వచ్చిన వారిలో పదిమందికి షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా ఉండాలంటే కొవిడ్‌ నుంచి కోలుకున్నాక కూడా షుగర్‌ని పరీక్షించుకోవడం, మాస్క్‌ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు స్టిరాయిడ్స్‌ వాడుతున్నట్లైతే.. వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. సొంతంగా ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ తీసుకున్నవారైతే.. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌లో వాడే హ్యుమిడిఫైర్‌..అంటే డిస్టిల్డ్‌ వాటర్‌, మంచి పరిశుభ్రమైన వాటర్‌ వాడాలి. కంటామినేటెడ్‌ వాటర్‌ వాడితే బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలెక్కువ.

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు