మిరియాలు, తేనె, అల్లం కరోనాకు మందు కాదు!

మిరియాలు, తేనె, అల్లం కరోనా నుంచి కాపాడతాయంటూ వస్తున్న వార్తలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ ట్విటర్‌ ఖాతా కొట్టిపారేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఓ అధ్యయనంలో ఇది నిరూపితమైందని, ఆ అధ్యయనాన్ని....

Published : 27 Apr 2021 00:52 IST

పుకార్లను నమ్మొద్దన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ ట్విటర్‌ ఖాతా

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కొవిడ్‌ మరణాలు 2 లక్షలకు చేరువయ్యాయి. మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో వైద్యులు సూచిస్తూనే వస్తున్నారు. అయితే ఇవి తీసుకుంటే కొవిడ్‌ మీ దరికి కూడా చేరదంటూ కొన్ని లింకులు, మెసేజ్‌లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మిరియాలు, తేనె, అల్లం కరోనా నుంచి కాపాడతాయంటూ వస్తున్న వార్తలను పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ ట్విటర్‌ ఖాతా కొట్టిపారేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఓ అధ్యయనంలో ఇది నిరూపితమైందని, ఆ అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా అంగీకరించినట్లు స్పష్టం చేసింది. ఈ విపత్కర సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించే మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేయొద్దని సూచించింది. అధికారిక వార్తలను మాత్రమే విశ్వసించాలని ప్రజలకు సూచించింది.

కరోనాను అధిగమించేందుకు మిరియాలు, తేనె, అల్లంను ఆహారం తీసుకోవాలని ఇప్పటివరకూ ఏ అధ్యయనం కూడా వెల్లడించలేదు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వీటిని తీసుకోవచ్చు కానీ ఇవి కరోనాను అధిగమించేందుకు సహకరించవు. శారీరక వ్యాయామం చేయాలని, ధ్యానం, యోగా ఆరోగ్యానికి మంచివని.. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి సహాయపడతాయని వైద్యులు చూసిస్తున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని