Menopause: మెనోపాజ్‌ తర్వాత రక్తస్రావం అవుతుందా..? ప్రమాదం సుమా..!

నెలసరి ఆగిపోయి ఏడాది అయ్యిందా..? ఈ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కదా..? అనుకోకుండా మళ్లీ రక్తస్రావం కనిపిస్తే మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌తో పాటు రకరకాల సమస్యలు ఆ మహిళలను వెంటాడుతున్నాయని భావించాలని పేర్కొంటున్నారు.

Published : 20 Aug 2022 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెలసరి ఆగిపోయి ఏడాది అయ్యిందా..? ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు కదా..? అనుకోకుండా మళ్లీ రక్తస్రావం కనిపిస్తే మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌తో పాటు రకరకాల సమస్యలు అలాంటి మహిళలను వెంటాడుతున్నాయని భావించాలని పేర్కొంటున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అన్ని రకాల పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలని సీనియర్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ ఎల్‌ జయంతీరెడ్డి సూచిస్తున్నారు.

నెలసరి ఆగిపోవడం వెనక..!

బహిస్టులు సుమారుగా 50 ఏళ్ల తర్వాత చాలా మందికి  ఆగిపోతాయి. కొంతమందికి 45 ఏళ్లకే ఆగిపోవచ్చు. ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌ఎస్‌హెచ్‌ పరీక్షలతో కూడా ముందుగానే రుతుక్రమం ఆగిపోయే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఎవరికైనా నెలసరి ఆగిపోయిన ఏడాది తర్వాత రక్తస్రావం కనిపిస్తే మంచిది కాదు. యుటెరస్‌లో పాలిప్స్‌, క్యాన్సర్‌ తయారయ్యే అవకాశం ఉంటుంది. వీళ్లు వెంటనే వైద్యులను కలుసుకొని పరీక్షలు చేయించుకోవాలి. బహిస్టులు ఆగిపోయిన మహిళలు ఏడాదికోసారి పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకుంటే మంచిది.  

ఏం చేయాలి..?

మెనోపాజ్‌ వచ్చిన మహిళలకు పాప్‌స్మియర్‌ పరీక్షతో పాటు ట్రాన్స్‌వెజినల్‌ స్కానింగ్‌ చేస్తే యుటెరస్‌ ఎలా ఉందో తెలుస్తుంది. ఎక్కడయినా సమస్య ఉంటే ఎండోస్కోపీ కూడా చేయించుకోవాలి. ఏవైనా గడ్డలుంటే బయాప్సీకి పంపించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎంఆర్‌ఐ కూడా చేయక తప్పదు. తర్వాతే ఏ సమస్యకు ఏ చికిత్స అందించాలో నిర్థారణకు రావచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని