వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

ఎల్గార్‌ పరిషత్‌ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ బాంబే హైకోర్టు విచారణ జరిపింది. విచారణ..

Published : 13 Jan 2021 16:11 IST

ముంబయి: ఎల్గార్‌ పరిషత్‌ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ బాంబే హైకోర్టు విచారణ జరిపింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం వరవరరావు వయసు, ఆరోగ్యం పరిగణనలోకి తీసుకోవాలని ఎన్‌ఐఏ, మాహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మనమంతా మనుషులమన్న విషయాన్ని మర్చిపోకూడదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వరవరరావు ముంబయి నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వరవరరావు చికిత్సకు అయ్యే ఖర్చులు తామే భరిస్తామని గతంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

ఇవీ చదవండి..
ఐపీఎల్‌ వల్లే ఆటగాళ్లకు గాయాలు

భారత్‌లో 102కు చేరిన కరోనా కొత్తరకం కేసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని