వరవరరావును కలిసేందుకు అనుమతి

బీమా కొరెగావ్‌ కేసులో నిర్బంధానికి గురైన విరసం నేత వరవరరావును కలిసేందుకు ఎట్టకేలకు వారి కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఆయనను కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ..

Updated : 28 Jul 2020 22:48 IST

ముంబయి: భీమా కోరెగావ్‌ కేసులో నిర్బంధానికి గురైన విరసం నేత వరవరరావును కలిసేందుకు ఎట్టకేలకు వారి కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఆయనను కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ అర్జీ పెట్టుకున్న నేపథ్యంలో బాంబే హైకోర్టు అనుమతించింది. ఇటీవలే కరోనా బారిన పడిన వరవరరావు ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రి వద్ద కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతిచ్చింది. వరవరరావును విడుదల చేయాలంటూ కొన్ని రోజులుగా ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి కొన్ని రోజులుగా కుటుంబం ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం గురించి పలుమార్లు మహారాష్ట్ర హోంమంత్రికి ఆయన భార్య లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని