Hyderabad: ప్రారంభమైన ఆషాఢ బోనాలు.. ముస్తాబవుతోన్న గోల్కొండ కోట

తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల ఉత్సవానికి గోల్కొండ ముస్తాబవుతోంది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట నుంచి ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు...

Updated : 30 Jun 2022 14:36 IST

హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల ఉత్సవానికి గోల్కొండ ముస్తాబవుతోంది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట నుంచి ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా కాస్త సందడి తగ్గినా ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గోల్కొండ బోనాల తర్వాత లష్కర్‌, లాల్‌దర్వాజ, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాలు నిర్వహించనున్నారు. గోల్కొండ బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

తలసాని మాట్లాడుతూ.. బోనాలు అత్యంత సంతోషకరమైన సమయమని.. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోంన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీక లాంటిదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నగరంలోని ప్రతి ఆలయానికి ఆర్థిక సాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా 8 ఏళ్లుగా రాష్ట్రంలో బోనాలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నామని.. నిర్వహణ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని